నిబంధనలు పాటించండి లేకుంటే వెళ్లిపోండి.. పలు సంస్థలకు కేంద్రం వార్నింగ్..

by Disha Web |
నిబంధనలు పాటించండి లేకుంటే వెళ్లిపోండి.. పలు సంస్థలకు కేంద్రం వార్నింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్: మన దేశంలో రోజురోజుకు వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్) వాడకం పెరిగిపోతోంది. దేశ ప్రభుత్వం నిషేధించిన కంటెంట్‌ను, అప్లికేషన్లను వినియోగించేందుకు వినియోగదారులు ఈ వీపీఎన్‌ను వాడుతున్నారు. అయితే తాజాగా కేంద్రం ప్రభుత్వం వీపీఎస్ సంస్థలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దేశంలోని వీపీఎన్ ప్రొవైడర్స్ అందరూ కూడా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐపీ మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. సరికొత్తగా దేశంలో అమలులోకి రానున్న గైడ్‌లైన్స్ ప్రతి ఒక్కరూ పాటించి తీరాలని, అలా చేయడానికి అభ్యంతరం వ్యక్తం చేసేవారికి ఒకే దారి ఉందని, అది ఇండియా మార్కెట్ నుంచి వైదొలగడమే అని మంత్రి తెలిపారు.

అయితే దేశంలో పెరుగుతన్న సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకొని ఆయన వీపీఎస్ సంస్థలకు ఈ హెచ్చరికలు చేశారు. 'భారత చట్టాలు, నిబంధనలను పాటించమనే అవకాశం ప్రస్తుతం ఎవరీ లేదు. మీకు లాగ్స్ లేకుంటే ఇకనైనా వాటిని మెయింటెన్ చేయండి. అదే వీరు వీపీఎస్ సంస్థ అయిఉండి మీరు నిబంధనలు పాటించే ప్రసక్తే లేదంటే భారత్ నుంచి తప్పుకోవడం తప్ప మరే ఛాన్స్ మీకు లేదు' అని చంద్రశేఖర్ తెలిపారు. అయితే తాజాగా గైడ్ లైన్స్ ప్రకారం.. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్, వీపీఎన్ సంస్థలు, డాటా సెంటర్ కంపెనీలు కనీసం 5 సంవత్సరాలకు సంబంధించిన తమ వినియోగదారుల డాటాను స్టోర్ చేసుకోవాలని మంత్రి తెలిపారు.

Next Story