చార్జింగ్ కేస్‌పై బ్యాటరీ ఎంత శాతం ఉందో చూపించే ఇయర్‌ఫోన్‌లు.. ధర కూడా తక్కువే!

by Disha Web Desk 17 |
చార్జింగ్ కేస్‌పై బ్యాటరీ ఎంత శాతం ఉందో చూపించే ఇయర్‌ఫోన్‌లు.. ధర కూడా తక్కువే!
X

దిశ, వెబ్‌డెస్క్: Blaupunkt కంపెనీ కొత్తగా వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను ఇండియాలో లాంచ్ చేసింది. దీని పేరు 'Blaupunkt BTW 20'. బడ్జెట్ ధరలో వినియోగదారులకు నచ్చే విధంగా తీసుకొచ్చిన ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు, దాని చార్జింగ్ కేసుపై బ్యాటరీ ఎంత శాతం ఉందో చూపిస్తుంది. దీని ధర రూ. 1,299. బ్లాక్, బ్లూ, గ్రీన్, వైట్ కలర్స్‌లలో అందుబాటులో ఉంటుంది. దీనిలో 10ఎమ్ఎమ్ డైనమిక్ డ్రైవర్‌లను అమర్చారు. అలాగే USB టైప్-సి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే గరిష్టంగా 30 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.


హెడ్‌సెట్ చార్జింగ్ కేస్‌లో LED డిస్‌ప్లేను ప్రత్యేకంగా అమర్చారు. దీని ద్వారా బ్యాటరీ ఎంత శాతం ఉందో తెలుస్తుంది. ఇంకా గూగుల్ అసిస్టెంట్, సిరి కోసం టచ్ కంట్రోల్స్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఇది బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గించి, మంచి సౌండ్‌ను అందిస్తుంది. నీటి నిరోధకత కోసం IPX5 రేటింగ్ కూడా చేయబడింది. ప్రస్తుతం ఇయర్‌ఫోన్‌లు అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.




Next Story

Most Viewed