జాగ్రత్త: గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారా.. ఇలా వచ్చిన విషయాలను నమ్మితే అంతే సంగతులు

by sudharani |
జాగ్రత్త: గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారా.. ఇలా వచ్చిన విషయాలను నమ్మితే అంతే సంగతులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ గూగుల్‌ను బాగా నమ్ముతున్నారు. ఎవరికి ఏం కావాలన్నా గూగుల్ ప్రధాన వనరుగా మారింది. ఎవరికి ఎలాంటి సమాచారం కావాలన్న వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అయితే.. గూగుల్‌లో సెర్చ్ చేయడం తప్పు కాదు. కానీ, గూగుల్‌లో వచ్చిన ప్రతీ సమాచారం నమ్మితే మోసపోయినట్లే అంటున్నారు భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే సౌబర్ దోస్త్ అనే ఏజెన్సీ. అసలు ఎలాంటి వాటి గురించి నమ్మకూడదు అనే విషయాల్లోకి వెళితే..

* దేనిగురించైనా గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి స్పాన్సర్ అని రాసి ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మోసం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఈ కంటెంట్ సెర్చ్‌లో పై వరుసలో వస్తుంది.

* అలాగే చాలా మంది కస్టమర్ కేర్ నంబర్ల గురించి సెర్చ్ చేస్తుంటారు. ఇలా పొరపాటున కూడా గూగుల్ నుంచి కస్టమర్ కేర్ నంబర్‌ను పొందినట్లయితే కోరుకోని ప్రాబ్లెమ్స్ తెచ్చుకున్నట్లు అవుతుందట. అయితే.. సంబంధిత కంపెనీ వెబ్ సైట్ నుంచి ఎల్లప్పుడూ కస్టమర్ కేర్ నంబర్‌ను పొందండం మంచిది.

* ఒక వెబ్‌సైట్ దాని URL లేదా వెబ్ సైట్ చిరునామాలో ‘https’ అని రాసి ఉండకపోతే.. ఈ సైట్‌ను చూడకపోవడమే మంచిది. ఎందుకంటే మోసపూరిత సైట్స్ ‘https’ ధృవీకరణనను కలిగి ఉండవు.

* ఒక విషయం గురించి మనం సెర్చ్ చేసినప్పుడు.. ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని నమ్మడం కంటే, మల్టీపుల్ రిజల్ట్స్ కోసం చెక్ చేయడం మంచిందంటున్నారు.

* ఇక మీ గూగుల్ హిస్టరీని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండటం మంచిది. ఎందుకంటే మీ ప్రమేయం లేకుండా ఎవరైనా మీ జీమెయిల్‌ని ఉపయోగించినట్లుయితే అది మీకు హిస్టరీ ద్వారా తెలుస్తోంది.

Next Story