ఐఫోన్ 14 ప్రోలో కొత్త ప్రాబ్లమ్.. ఛార్జింగ్‌కు ఇబ్బందవుతున్న కెమెరా..?

by Disha Web |
ఐఫోన్ 14 ప్రోలో కొత్త ప్రాబ్లమ్.. ఛార్జింగ్‌కు ఇబ్బందవుతున్న కెమెరా..?
X

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రోలో సరికొత్త సమస్య వచ్చిందని, దీని కారణంగా యూజర్లు ఇబ్బంది పడుతున్నారని తాజాగా ఓ నివేదిక పేర్కొంది. అయితే ఐఫోన్ 14 ప్రో కొనుగోలు చేసిన వినియగదారులకు వైర్‌లెస్ చార్జింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాబ్లమ్‌కు ఐఫోన్ 14 ప్రోకు ఉన్న పెద్ద కెమెరాలే కారణమని, ఆ కెమెరాలే వైర్‌లెస్ ఛార్జింగ్‌లో ఇబ్బందులు సృష్టిస్తున్నాయని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా తాము కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ వినియోగించేటప్పుడు ఫోన్ కెమెరా భారీగా షేక్ అవుతుందని, అది పెద్ద సమస్యగా మారిందని కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేశారని, అంతేకాకుండా ఆ షేకీ కెమెరా ఫ్యూచరే ఛార్జింగ్ విషయంలో కూడా సమస్యలు సృష్టిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై యాపిల్ సంస్థ స్పందించలేదు. మరి దీనికి సంస్థ యాజమాన్యం త్వరలో ఏమైనా పరిష్కారం చూపుతుందా, లేకుంటే ఈ సమస్యను పరిష్కరించి వినియోగదారులకు పీస్ టు పీస్ బ్యాక్ పాలసీలో కొత్త ఫోన్లు అందిస్తుందా అనేది చూడాలి.

Next Story

Most Viewed