కొత్త ఫీచర్స్‌తో ఆపిల్ లేటేస్ట్ అప్‌డేట్ వెర్షన్

by Harish |
కొత్త ఫీచర్స్‌తో ఆపిల్ లేటేస్ట్ అప్‌డేట్ వెర్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపిల్ కంపెనీ త్వరలో తన వినియోగదారులకు మరిన్ని అదనపు ఫీచర్లతో కొత్త వెర్షన్‌ iOS 16.5ను విడుదల చేయనుందని సమాచారం. మార్చి చివరి నుండి కంపెనీ దీనిని టెస్టింగ్ చేస్తుంది. దీనిలో చిన్న చిన్న మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా రెండు కొత్త అప్‌డేట్‌లు ఉండనున్నాయి. మొదటిది స్పోర్ట్స్ ట్యాబ్. ఇది వినియోగదారులు తమకు ఇష్టమైన జట్లు, లీగ్‌ల కోసం వార్తలు, స్కోర్‌లు, షెడ్యూల్‌లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. రెండోది స్క్రీన్ రికార్డింగ్‌ ఫీచర్. దీంతో యూజర్లు సిరిని ఉపయోగించి స్క్రీన్ రికార్డింగ్‌ను ప్రారంభించవచ్చు లేదా ఆపవచ్చు. ఐఫోన్ స్క్రీన్ వీడియోను రికార్డ్ చేయడానికి “హే సిరి, స్క్రీన్ రికార్డ్” అని చెప్పడానికి, కావలసినప్పుడు రికార్డింగ్‌ను ఆపమని సిరిని కొరడానికి అవసరమైన అప్‌డేట్‌‌ను దీనిలో అందించనున్నారు.

Next Story

Most Viewed