బడ్జెట్ ధరలో Apple iPad!

by Harish |
బడ్జెట్ ధరలో Apple iPad!
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా యాపిల్ ఫోన్లు, iPadలు వంటివి ఎక్కువ ధరలో ఉంటాయి. అందుకే వీటిని కొనడానికి భారీ మొత్తంలో డబ్బులు అవసరం ఉంటుంది. అయితే యాపిల్ తన అమ్మకాలను పెంచుకోవడానికి మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని 2024 ద్వితీయార్థంలో తక్కువ ధరలో iPad ని విడుదల చేయనున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. Nikkei Asia ప్రకారం, రాబోయే ప్రోడక్ట్ కోసం రూపకల్పన, అభివృద్ధిపై సరఫరాదారులతో యాపిల్ చర్చిస్తున్నట్లు సమాచారం. కొత్త ఐప్యాడ్ మోడల్ కోసం ఇంజనీరింగ్ ధృవీకరణ వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్యలో ప్రారంభమవుతుంది. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే ఈ మోడల్ అందుబాటులోకి రానుంది. ఇంతకుముందు 2022లో $449 ధరతో iPad ని విడుదల చేసింది. యాపిల్ ఇండియాలో ఏడాదికి 50 మిలియన్లకు పైగా ఐఫోన్‌లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. చైనా నుంచి తన ఉత్పత్తులను క్రమంగా భారత్‌కు తరలిస్తుంది.

Next Story

Most Viewed