అదిరిపోయే రెండు మ్యాక్‌బుక్‌లను లాంచ్ చేసిన Apple కంపెనీ

by Harish |
అదిరిపోయే రెండు మ్యాక్‌బుక్‌లను లాంచ్ చేసిన Apple కంపెనీ
X

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా కాలిఫోర్నియాలో జరిగిన WWDC 2023 ఈవెంట్‌ సందర్బంగా యాపిల్ కంపెనీ రెండు మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్‌లను ఆవిష్కరించింది. ఈ రెండు కూడా MacBook Air M2 లో 15-inch, 13 inch లుగా లాంచ్ అయ్యాయి. ఈ రెండు కూడా USB Type-C పోర్ట్‌ను కలిగి ఉన్నాయి. 13 అంగుళాల MacBook Air ప్రారంభ ధర రూ.1,19, 900. 15-అంగుళాల MacBook Air ప్రారంభ ధర రూ. 1,34,900. ఈ రెండు ల్యాప్‌టాప్‌లు Apple India వెబ్‌సైట్‌లో, అధికారిక స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉండనున్నాయి. అత్యంత వేగంగా వీటి ఆపరేటింగ్ స్పీడ్ ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Apple MacBook Air M2 13 స్పెసిఫికేషన్లు: ఇది 13.6-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేతో, M2 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ల్యాప్‌టాప్ గరిష్టంగా 2TB SSD మెమరీని కలిగి ఉంటుంది.1080p HD (1920 x 1080 పిక్సెల్‌లు) వెబ్ కెమెరాతో Dolby Atmosతో నాలుగు-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌‌ కూడా ఉంది. ల్యాప్‌టాప్ మ్యాజిక్ కీబోర్డ్, ఫోర్స్ టచ్ ట్రాక్‌ప్యాడ్‌తో వస్తుంది. 67W చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. దీన్ని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది.



Apple MacBook Air M2 15 స్పెసిఫికేషన్లు: ఇది 15.3-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంది. M2 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. ల్యాప్‌టాప్‌లో 8-కోర్ CPU, 16-కోర్ న్యూరల్ ఇంజన్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన కొత్త ఆరు-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ మోడల్ కూడా ఒక్కసారి చార్జింగ్‌తో 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. దీని బరువు 1.49 కిలోలు. దీనిలో 1080p HD కెమెరా కలిగి ఉంది.




Next Story

Most Viewed