AI ఫీచర్లతో Amazfit కొత్త స్మార్ట్‌వాచ్

by Harish |
AI ఫీచర్లతో Amazfit కొత్త స్మార్ట్‌వాచ్
X

దిశ, టెక్నాలజీ: ప్రముఖ స్మార్ట్‌వాచ్ కంపెనీ Amazfit ఇండియాలో ఈ రోజు కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Amazfit యాక్టివ్’. ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్, అమాజ్‌ఫిట్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ధర రూ.12,999. ఇది లావెండర్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, పింక్ కలర్స్‌లలో లభిస్తుంది. కొనుగోలు సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై తగ్గింపులు కూడా ఉంటాయి. ఈ వాచ్‌లో ప్రత్యేకంగా AI ఫీచర్లను అందించారు.

Amazfit యాక్టివ్ స్మార్ట్‌వాచ్‌ 390 x 450 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.75-అంగుళాల AMOLED డిస్‌ప్లే‌ను కలిగి ఉంది. దీని పిక్సెల్ డెన్సిటీ 341 ppi. GPS, బ్లూటూత్ కనెక్టివిటీ, ముందే ఇన్‌స్టాల్ చేసిన అమెజాన్ అలెక్సాను స్మార్ట్ అసిస్టెంట్‌ వంటి వాటిని కలిగి ఉంటుంది. వాచ్ అల్యూమినియం మిడిల్ ఫ్రెమ్‌తో సిలికాన్ పట్టీలను కలిగి ఉండి తేలికగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

వినియోగదారుల హెల్త్ కోసం ఫిజికల్ ఫిట్‌నెస్, అలసట, వ్యాయామ ట్రాకింగ్, 24x7 హృదయ స్పందన రేటు, రక్తం-ఆక్సిజన్ స్థాయి, ఒత్తిడి మానిటర్ వంటి వాటిని కలిగి ఉంటుంది. రోజు హెల్త్ డేటాను పొందడానికి Zepp యాప్‌తో కనెక్ట్ కావచ్చు. అలాగే ఇది కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తుంది. వాచ్ దాదాపు 120 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ ఇస్తుంది. దీని బ్యాటరీ లైఫ్ 14 రోజుల వరకు లభిస్తుందని కంపెనీ పేర్కొంటుంది.

Next Story

Most Viewed