కీబోర్డ్‌ టైపింగ్‌లో వచ్చే సౌండ్‌తో పాస్‌వర్డ్ కనిపెడుతున్న AI..!

by Harish |
కీబోర్డ్‌ టైపింగ్‌లో వచ్చే సౌండ్‌తో పాస్‌వర్డ్ కనిపెడుతున్న AI..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(AI) గురించే చర్చ జరుగుతుంది. దీని వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతకంటే ఎక్కువ నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. కొంతమంది అయితే AI ని మానవ మనుగడకు ప్రమాదకరంగా పేర్కొంటున్నారు. ఇటీవల చాలా మంది నిపుణులు AI తో కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు.

కార్నెల్ యూనివర్సిటీ కూడా AI గురించి ఒక ప్రయోగాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా ఏఐ టూల్స్‌తో యూజర్ల పాస్‌వర్డ్‌ను తెలుసుకునే అవకాశం ఉందని కనుక్కుంది. AI టూల్స్‌‌ సహాయంతో ఒక ప్రోగ్రామ్‌ను ఒక స్మార్ట్‌ఫోన్‌లో యాక్టివేట్ చేయగా, అది దానికి దగ్గరగా ఉన్న వేరే డివైజ్‌లో ఎంటర్ చేసే పాస్‌వర్డ్‌ను 93 శాతం ఖచ్చితత్వంతో కనిపెట్టింది. పాస్‌వర్డ్‌ను టైపింగ్ చేసేటప్పుడు వచ్చే సౌండ్ ఆధారంగా AI టూల్స్ పాస్‌వర్డ్‌ను కనిపెట్టాయి. టైపింగ్ చేసే సందర్భంలో ఒక్కో అక్షరానికి ఒక్కో రకమైన సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. AI టూల్స్‌కు కీబోర్డ్‌లో టైప్ చేసే సౌండ్‌ను అర్థం చేసుకోగల సామర్థ్యం ఉంది. దీంతో అది పాస్‌వర్డ్‌లను కనిపెడుతుందని ప్రయోగంలో కనుక్కున్నారు.

ప్రయోగంలో భాగంగా శాస్త్రవేత్తలు ఒక డివైజ్‌కు AI టూల్స్‌తో శిక్షణ ఇచ్చి యాపిల్ మ్యాక్‌బుక్ ప్రోలో పాస్‌వర్డ్ టైపింగ్ చేశారు. మ్యాక్‌బుక్ ప్రోలోని ప్రతి 36 కీలను 25 సార్లు నొక్కారు. దీంతో AI టూల్స్‌ బటన్ ప్రెస్ చేసే ఒత్తిడిలో వచ్చే సౌండ్‌ను అర్ధం చేసుకుంది. తరువాత వేర్వేరు వేళ్లతో బటన్‌లను నొక్కిన కూడా 95 శాతం ఖచ్చితమైన పాస్‌వర్డ్‌ను కనిపెట్టినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. AI ని ఇంకా ఆధునికరిస్తే 100 శాతం ఖచ్చితంగా పాస్‌వర్డ్‌ను కనిపెట్టగలదని వారు తెలిపారు.

అయితే దీని పట్ల నిపుణులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకుంటే AIకి పాస్‌వర్డ్ కనిపెట్టే టెక్నాలజీ ఉంటే, అది చాలా ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు. ఈ టూల్స్‌ను ఉపయోగించి హ్యాకర్స్ ఈజీగా ఇతరుల బ్యాంక్ పాస్‌వర్డ్‌లు, ఇతర వ్యక్తిగత పాస్‌వర్డ్‌లను దొంగలించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అయితే ఈ ప్రయోగం ద్వారా రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(AI)ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలాంటి ప్రోగ్రామ్‌లను ఇవ్వాలి అనే దానిపై ముందస్తు జాగ్రత్త ఉంటుందని నిపుణులు తెలిపారు.

Next Story

Most Viewed