- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
38 ఏళ్ల తర్వాత సరికొత్త ఫొటోషాప్ ఫీచర్స్‌తో మైక్రోసాఫ్ట్ పెయింట్
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ దాదాపు 38 సంవత్సరాల తర్వాత దాని ‘పెయింట్’ యాప్‌కు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ప్రస్తుతం ఫొటో షాప్‌లో అగ్రస్థానంలో ఉన్నటువంటి అడోబ్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ పెయింట్‌లో అధునాతన ఆప్షన్స్ అందించనుంది. దీనికి సంబంధించిన అప్‌డేట్‌లను 11.2308.18.0 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ వాడుతున్న విండోస్ ఇన్‌సైడర్‌లకు పెయింట్ యాప్ కోసం అప్‌డేట్‌ను విడుదల చేశారు.
ఈ కొత్త అప్‌డేట్‌లతో యూజర్లు పెయింట్ యాప్‌లోనే డిజిటల్ ఎడిటింగ్ చేయడం, ఇమేజ్ మానిప్యులేషన్, బ్యాక్‌గ్రౌండ్ ఎడిటింగ్, కొత్త లేయర్స్‌ను యాడ్ చేయడం, PNG ఇమేజ్‌లను ఓపెన్ చేయడం లేదా ఇమేజ్‌లపై ఉన్న కంటెంట్‌ను మార్చడం లేదా మొత్తం తీసివేయడం లాంటివి చేయవచ్చు.
చాలా కాలంగా అడోబ్ ఫొటోషాప్ ఎడిటింగ్ విభాగంలో అగ్రస్థానంలో ఉంది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యూజర్లు ఫొటో ఎడిటింగ్‌ల కోసం అడోబ్‌ను వాడుతున్నారు. ఇలాంటి తరుణంలో మైక్రోసాఫ్ట్ తన పెయింట్ యాప్‌కు కొత్త ఆప్షన్స్ అందించి యూజర్లను తనవైపు తిప్పుకుని మార్కెట్‌ను బాగా పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ అప్‌డేట్‌ను పొందటానికి Windows Insider Canary కి సైన్ అప్ చేయాలి. లేదంటే అప్‌డేట్ ఆటోమెటిక్‌గా వచ్చే వరకు వేచి ఉండాలి.