- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
ASUS నుంచి 12th Gen Intel Core Processors తో కొత్త డెస్క్‌ట్యాప్‌లు

దిశ, వెబ్‌డెస్క్: తైవాన్ కంపెనీ ఆసుస్ బుధవారం ఇండియాలో కొత్తగా రెండు డెస్క్‌ట్యాప్‌లను విడుదల చేసింది. A3 సిరీస్‌లో భాగంగా A3202, A3402 వేరియంట్లను లాంచ్ చేసింది. రెండు కూడా 12వ జెన్ i5-1235G7 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హైబ్రిడ్ వర్క్ నడుస్తున్న తరుణంలో టెక్ ఉద్యోగులకు సరిగ్గా ఉపయోగపడే విధంగా వీటిని తెచ్చినట్లు కంపెనీ తెలిపింది. రెండు వేరియంట్లు Dolby Atmos సపోర్ట్, కొత్త అధునాతన బాస్-రిఫ్లెక్స్ డిజైన్ కలిగి ఉన్నాయి.
ASUS A3202 డిస్‌ప్లే 21.45 అంగుళాలు ఉంటుంది. ఇది ఫుల్ HD తో వస్తుంది. Asus A3402 వేరియంట్ 23.8-అంగుళాల పూర్తి HD IPS LCD నానోఎడ్జ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది100 శాతం SRGB డిస్‌ప్లేను కలిగి ఉంది. రెండు కూడా ఇంటిగ్రేటెడ్ HDMI-ఇన్ పోర్ట్‌తో వస్తున్నాయి.
ఇవి అంతర్నిర్మిత అర్రే మైక్రోఫోన్‌లతో(అలెక్సాతో) అమర్చబడి ఉంటాయి. ఫొటో ఎడిటింగ్, గేమింగ్‌లకు కరెక్ట్‌గా సరిపోతాయి. ASUS A3202 ధర రూ. 54,990. Asus A3402 ధర రూ. 65,990. రెండు కూడా ఈ కామర్స్ సైట్లు, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.