Moon:ఆకాశంలో అద్భుతం.. రేపటి నుంచి ఆకాశంలో రెండు చందమామలు

by Jakkula Mamatha |   ( Updated:2024-09-28 14:19:23.0  )
Moon:ఆకాశంలో అద్భుతం.. రేపటి నుంచి ఆకాశంలో రెండు చందమామలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఆకాశంలో రేపటి నుంచి అద్భుతం చూడబోతున్నారు. అందరి మనసులు దోచేసే ఆ చందమామ రేపటి నుంచి మరో చందమామతో ఆకాశంలో కనువిందు చేయనుంది. దీనినే మినీ మూన్‌గా చెబుతారు. ‘‘సాధారణంగా భూ గురుత్వాకర్షణను తప్పించుకోలేక కొద్దికాలం ప్రదక్షిణ చేసే గ్రహ శకలాలను ‘మినీ మూన్స్‌’’ అంటారు. ఇవి చిన్నగా ఉండటం, అతి వేగంగా కదలడం వల్ల వీటిని గుర్తించడం కష్టంగా ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. భూగోళం మినీ మూన్‌ని అనుభూతి చెందనుంది. ఆస్టరాయిడ్ 2024 PT5 సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 వరకు మానవాళికి దర్శనమివ్వనుంది.

అనంతరం భూ గురుత్వాకర్షణ శక్తి వల్ల కక్ష్య నుంచి వీడిపోతుంది. తర్వాత ఆ గ్రహశకలం తిరిగి అంతరిక్షంలోకి ఎగిరిపోతుందని చెబుతున్నారు. రెండో చంద్రుడుగా పిలుస్తున్న PT5 గ్రహశకలం చాలా ఎత్తులో ఉంటుందంట. ఇది నేరుగా కంటికి కనిపించకపోయినా టెలిస్కోప్‌తో చూడవచ్చు. అర్జున ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి వచ్చిన ఈ గ్రహశకలం 33 అడుగులు, వెడల్పు 138 అడుగుల వరకు ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. రష్యాలో 2013లో పేలిన గ్రహశకలం కన్నా ఇది పెద్దదని చెబుతున్నారు. కొందరు దీని వల్ల ఏదైనా ముప్పు పొంచి ఉందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని పై ఆందోళన అవసరం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. వీటి రాక సహజమేనని, ఇలాంటివి అనేకం భూ కక్ష్యలోకి వచ్చిపోతుంటాయన్నది నిపుణుల అభిప్రాయం.

Advertisement

Next Story