టెక్ మహీంద్రా ఆదాయం రూ. 9,106 కోట్లు

by  |
టెక్ మహీంద్రా ఆదాయం రూ. 9,106 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 1.36 శాతం పెరిగి రూ. 972.3 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 959.30 కోట్లుగా ఉంది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ఆదాయం 5.23 శాతం పెరిగి రూ. 9,106.30 కోట్లకు చేరుకుంది.

త్రైమాసిక ఫలితాలపై స్పందించిన టెక్ మహీంద్రా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మనోజ్ భట్..అంతర్జాతీయంగా మారిన పరిస్థితుల్లో వ్యాపారాలన్నీ డిజిటల్ విధానంలోకి మారుతున్నందున వినియోగదారులు కొత్త సాంకేతికతను అనుసరిస్తున్నారని తెలిపారు. కాగా, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ లాభం 1.03 శాతం తగ్గి రూ. 1,300.50 కోట్లకు చేరిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తాము ఖర్చులను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, డిమాండ్‌ను సాధారణ స్థాయికి చేర్చేందుకు అవసరమైన వాటిని అభివృద్ధి చేస్తామని మనోజ్ భట్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed