విధుల్లో నిర్లక్ష్యం.. ఉపాధ్యాయులపై వేటు!

by  |
విధుల్లో నిర్లక్ష్యం.. ఉపాధ్యాయులపై వేటు!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో పాఠశాలలు తెరచుకున్నా విధులకు హాజరుకాని సిబ్బందిపై వేటు పడింది. కర్నూలు జిల్లాలోని గార్గేయపురం జిల్లా పరిషత్ పాఠశాల సిబ్బంది మంగళవారం విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు. విద్యార్థులు పాఠశాలకు హాజరైనా బోధనా సిబ్బంది లేకపోవడంతో వారు ఏం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోయారు.

విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు పాఠశాల హెడ్ మాస్టర్‌తో సహా, ఐదుగురు టీచర్లు, జూనియర్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ వేటు వేశారు.ఈ మేరకు ఇవాళ సాయంత్రం డీఈవో సాయిరాం ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story

Most Viewed