అమ్మ ఒక జిల్లా.. నాన్న మరో జిల్లా.. నేను ఏ జిల్లా కేసీఆర్ తాత ?

139
Request-to-kcr11

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీల్లో భాగంగా ఆ చిన్నారుల తల్లిదండ్రులిద్దరినీ చెరో జిల్లాకు కేటాయించారు. దీంతో సంక్రాంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారులు సీఎం కేసీఆర్ కు వినూత్న రీతిలో విజ్ఞప్తి చేశారు. తమ తల్లికి ఒక జిల్లా, తమ తండ్రికి మరో జిల్లా కేటాయించడంతో తమ పరిస్థితి ఏంటని వారు విన్నవించుకున్నారు. తాము ఏ జిల్లాకు వెళ్ళాలి కేసీఆర్ తాత అంటూ ముగ్గు రూపంలో ప్రశ్నించారు. కేసీఆర్ తాత మాటే ముద్దని, దంపతులను విడదీయొద్దని కోరారు. Spouse బ్లాక్ చేసిన జిల్లాలో ఓపెన్ చేసి దంపతులను ఒకే జిల్లాకు కేటాయించాలన్నారు.

ఇదిలా ఉండగా మరో చిన్నారి వీడియో రూపంలో కేసీఆర్ కు విన్నవించుకుంది. తన తల్లికి చాలా దూరం ట్రాన్స్ ఫర్ చేశారని, తన తల్లికి దూరంగా తాను ఉండలేను కేసీఆర్ తాత అంటూ వీడియోలో తెలిపింది. సీఎం అందరికీ సహాయం చేస్తారని.. తనకు ఈ సాయం చేసిపెట్టాలని విజ్ఞప్తి చేసింది.