‘ఆ జీవోలు వెంటనే విడుదల చేయాలి’

by  |
‘ఆ జీవోలు వెంటనే విడుదల చేయాలి’
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్​ చేసిన ప్రకటనకు అనుగుణంగా పీఆర్సీకి సంబంధించిన అంశాలపై వెంటనే జీఓలు జారీ చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్​ అసోసియేషన్​ అధ్యక్షుడు చిలగాని సంపత్​ కుమారస్వామి డిమాండ్​ చేశారు. వచ్చేనెలలోనైనా ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంపత్​ కుమారస్వామి ప్రకటించారు. టీఈఏ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అంశంపై ప్రభుత్వం నాన్చివేత ధోరణిని అవలంభిస్తుందని ఆరోపించారు.

అదే విధంగా కరోనా ఫ్రంట్​లైన్​వారియర్స్​ కుటుంబాలను ఆదుకోవాలని, కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఆర్థిక సాయం అందించి, ఉద్యోగావకాశం కల్పించాలన్నారు. అంతేకాకుండా కరోనా, బ్లాక్​ ఫంగస్​ వ్యాధులను ఎదుర్కొంటూ ప్రజలకు సేవలందిస్తున్న ఫ్రంట్​లైన్​ వారియర్స్​ కుటుంబాలకు ఉచితంగా వ్యాక్సిన్​ అందించాలని, వారికి 25 శాతం రిస్క్​ అలవెన్స్​తో పాటు 10 శాతం అదనంగా వేతనం ఇవ్వాలని సంపత్​ డిమాండ్​ చేశారు. కరోనా వచ్చిన ఉద్యోగులకు 21 రోజుల స్పెషల్​ క్యాజువల్​ సెలవు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అన్ని ప్రైవేట్​, కార్పొరేట్​ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో టీఈఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి. పురుషోత్తం, మహిళా అధ్యక్షురాలు డా. జి. నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed