జగన్ బొమ్మ.. బాబు, నిమ్మగడ్డ కొంప ముంచుతుందా?

by  |
జగన్ బొమ్మ.. బాబు, నిమ్మగడ్డ కొంప ముంచుతుందా?
X

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు చెప్పినట్లే వింటున్నారా..? చంద్రబాబు మెప్పుకోసం ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత ఏపీ రాజకీయ పరిణామాలు.

రేషన్ అందించే వాహనాలపై సీఎం జగన్ ఫోటో పెట్టొద్దని ఎస్ఈసీ నిమ్మగడ్డ అంటుంటే.. పొద్దున్నే లేచి జగన్ బొమ్మును చూడలేకపోతున్నామని టీడీపీ నేతలు అంటున్నారు. ఇప్పుడు ఈ జగన్ బొమ్మల అంశం రాష్ట్రంలో హాట్ టాపిగ్గా మారింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ, టీడీపీ నేతల చర్యలు ఆ పార్టీ కొంపముంచేలా ఉన్నాయంటూ రాజకీయ ఉద్దండులు గుసగుసలాడుకుంటున్నారు.

అందుకు కారణం లేకపోలేదు. ఏపీలో అధికార పార్టీ అధికార పార్టీ వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని వ్యతిరేకిస్తున్న ఎస్ఈసీ.., రేషన్ డోర్ డెలివరీ వాహానాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. హైకోర్ట్ ఆదేశాలతో రేషన్ వెహికల్స్ లోపల, భయట చెక్ చేసిన నిమ్మగడ్డ కొన్ని మార్పులు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. రేషన్ వాహనాలపై సీఎం జగన్, వైఎస్ఆర్ ఫోటోలు ఉన్నాయని, ఆ ఫోటోలు ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. వెంటనే వాటిని తొలగించాలని స్పష్టం చేశారు.

తాజాగా నిమ్మగడ్డ రేషన్ వెహికల్స్ అంశం ముగియకముందే.. టీడీపీ నేతలు ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఫైబర్ గ్రిడ్ పై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ పై 10లక్షల టీవీలు పనిచేస్తున్నట్లు చెప్పారు. అయితే తాము ఏ టైమ్ లో టీవీ ఆన్ చేసినా సీఎం జగన్ బొమ్మ కనిపిస్తోందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే జగన్ ఫోటోను తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మరి ఈ ఫిర్యాదు అంశం ఎటు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

నేను చెప్పే వరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంట్లోనే నిర్బంధించండి



Next Story

Most Viewed