ఆ 'పేటెంట్' వేరెవరికీ దక్కకూడదనే కదా : వర్ల రామయ్య

by  |
ఆ పేటెంట్ వేరెవరికీ దక్కకూడదనే కదా : వర్ల రామయ్య
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. వైసీపీ అమలు చేస్తున్న విధానాలా మీద టీడీపీ ప్రశ్నలు గుప్పిస్తుంటే, కావాలనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అధికారపార్టీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ పై టీడీపీ నేత వర్ల రామయ్య రీకౌంటర్ ఇచ్చారు.

భూకబ్జాలకు పాల్పడితే ఊరుకునేది లేదంటూ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్ల పై సెటైర్లు వేశారు. భూ కబ్జాల ‘పేటెంట్’ ఆయనకు తప్ప వేరెవరికీ దక్కకూడదనే కదా అలాంటి వ్యాఖ్యలు చేశారంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారంటూ ఆయన ట్వీట్ చేశారు. ”విజయసాయి రెడ్డి గారూ! బాగా సెలవిచ్చారు. విశాఖలో ఎవరు భూకబ్జాలకు పాల్పడినా వదిలేది లేదన్నారు. ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు. మీ పార్టీ వారిని కూడా వదలకూడదని అద్భుతమైన నీతి వ్యాఖ్యాలు వల్లించారు. మీకు అభినందనలు. అవునులే, ఆ ‘పేటెంట్’ వేరెవరికీ దక్కకూడదు. అంతేకదా? బహుపరాక్ విశాఖ!’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed