మంత్రులకు రైతుల సమస్యలు పట్టవా !

2

దిశ, వెబ్‌డెస్క్: మంత్రులు, వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతే మంత్రులు, వైసీపీ నేతలకు పట్టవా అని విమర్శించారు. భారీ వర్షాలతో దాదాపు 2.2లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిల హామీపై సీఎం జగన్ రైతులను మోసం చేశారని మండిపడ్డారు. వెంటనే రైతులకు బకాయిలు చెల్లించి ఆదుకోవాలని స్పష్టం చేశారు.