ఏపీలో పాలి‘ట్రిక్స్’.. జగన్‌కు గంటా ట్వీట్ !

by  |
ఏపీలో పాలి‘ట్రిక్స్’.. జగన్‌కు గంటా ట్వీట్ !
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నుంచి మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస్‌రావు వైఎస్ జగన్‌పై ఏ రేంజ్‌లో విరుచుకుపడ్డారో అందరికీ తెలిసిందే. అయితే 2019ఎలక్షన్స్‌లో సీన్ తారుమారు అయి వైసీపీ ఘనవిజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి విశాఖలో మౌనంగా తన పని తాను చూసుకుంటున్న గంటా శ్రీనివాస్.. నిన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఒక్కసారిగా వార్తల్లో నిలిచి.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దన్ని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ఇదేక్రమంలో ఇవాళ ఉదయం ఏపీ సీఎం జగన్‌కు గంటా శ్రీనివాస్‌ ట్వీట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ కోసం ప్రధానికి లేఖ రాసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం అద్యక్షతన అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకోళ్లాలని రిక్వెస్ట్ చేశారు. నా రాజీనామాపై వస్తున్న విమర్శలు అర్ధరహితమన్న గంటా..స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed