‘మంత్రులకు కమీషన్లపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులపై లేదు’

by  |
‘మంత్రులకు కమీషన్లపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులపై లేదు’
X

దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు మద్యం, ఇసుక దందాలు, కాంట్రాక్టర్ల ఇచ్చే కమీషన్లపై ఉన్న శ్రద్ధ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడంలో లేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి దయాకర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి జూరాల ప్రాజెక్టును రీడిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… గతంలో ఇచ్చిన 69 జీవో ద్వారా నారాయణపేట-కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరు ఇవ్వాలని కోరారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌పై ఆధారపడేకన్నా జూరాల నుంచి 37.74 టీఎంసీల నికర, 40 టీఎంసీల వరదనీటిని ఒడిసి పట్టేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇలా చేయడం వల్ల రంగారెడ్డి జిల్లాకు కూడా సాగునీరు, హైదరాబాద్‌కు తాగు నీటి సమస్య తీరుతుందని తెలిపారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి, నాయకులు నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed