TCPL సీజన్ 4 పోస్టర్ ఆవిష్కరణ

by  |
TCPL సీజన్ 4 పోస్టర్ ఆవిష్కరణ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్‌ సీజన్‌ 4‌ను.. ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ఆ లీగ్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ వెంకటేష్ చెప్పారు. శనివారం కేవీఐసీ(Khadi & Village Industries Commission) సౌత్ జోన్ చీఫ్ పేరాల శేఖర్ రావు TCPL లోగో, బ్రోచర్‌, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లీగ్ డైరెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ సారి కార్పొరేట్ ఉద్యోగులు మాత్రమే కాకుండా… ఓపెన్ కోటా నుంచి క్రికెట్‌పై ఆసక్తి ఉన్న 25 ఏండ్ల లోపు యువతకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడాలనుకుంటే పేరు నమోదు చేసుకోవచ్చని సూచించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లల్లో అద్భుతమైన ప్రదర్శన.. క్రమ శిక్షణ, క్రీడా స్ఫూర్తి కలిగిన ఆటగాళ్లను పారదర్శకంగా సెలెక్ట్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడాలనుకుంటే ముందుగా www.tcplt20.com వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ రుసుము రూ. 830 చెల్లించిన అనంతరం సెలక్షన్ కోసం నిర్ణయించిన తేదీల్లో బ్యాచుల వారీగా ఆటగాళ్లను పిలుస్తామన్నారు. వీరికి ఐసీసీ లెవెల్ 1, బీసీసీఐ లెవెల్ 2, మాజీ HCA ఆటగాళ్ల కోచ్‌ల ఆధ్వర్యంలో నెట్ ప్రాక్టీస్ ఉంటుందని చెప్పారు.

సెలక్షన్, క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లల్లో ఆటగాళ్ల ప్రతిభను పారదర్శకంగా గుర్తించి.. వారిని మెయిన్‌ లీగ్‌లో 15 మందితో కూడిన స్క్వాడ్‌ను నిర్ణయిస్తున్నట్టు పేర్కొన్నారు. తుది జట్టులో కార్పొరేట్ కోటా నుంచి 8 మంది, ఓపెన్ కోటా నుంచి 7 మంది ఆటగాళ్లను తీసుకుంటామని, ఇదే క్రమంలో జట్లను కూడా ఎంపిక చేసి మెయిన్ లీగ్‌లో ఆడించనున్నట్టు లీగ్ డైరెక్టర్ వెంకటేష్ వెల్లడించారు. రిజిస్ట్రేషన్‌ చివరి తేది వచ్చే నెల 10తో ముగుస్తుందని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed