వాహన రుణాలందించేందుకు ఎస్‌బీఐతో టాటా మోటార్స్ జట్టు!

by  |
వాహన రుణాలందించేందుకు ఎస్‌బీఐతో టాటా మోటార్స్ జట్టు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)తో ప్రముఖ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సంస్థ అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) చేసుకుంది. టాటా మోటార్స్‌కు చెందిన స్మాల్, లైట్ కమర్షియల్ వాహనా కొనుగోళ్లకు సంబంధించి ఆర్థిక సహాయం అందించేందుకు ఈ అవగాహనా ఒప్పందం జరిగినట్టు కంపెనీ శుక్రవారం తెలిపింది.

కంపెనీ కమర్షియల్ వాహన(సీవీ) కస్టమర్లకు ఇబ్బందులు లేకుండా రుణాలు అందించేందుకు ఇది వీలు కల్పిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది సులభ పద్ధతిలో రుణ పథకాలను అందిస్తుంది. డౌన్ పేమెంట్, ఈఎమ్ఐ అంశాల్లో తగ్గింపునకు ఈ పథకాలు ఉపయోగపడతాయని వివరించింది.

‘ఈ భాగస్వామ్యం దేశవ్యాప్తంగా ఎస్‌బీఐకి ఉన్న 22 వేలకు పైగా శాఖల్లో లభిస్తుందని’ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ గిరీష్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో, ఉపాధి వర్గానికి సహాయం చేయడంతో పాటు వినియోగదారులకు ప్రత్యేకమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆశిస్తున్నాం. ఈ భాగస్వామ్యం ద్వారా అది సాధ్యపడుతుందని నమ్ముతున్నట్టు గిరీష్ వెల్లడించారు.

Next Story

Most Viewed