సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.. ఫైనల్లో తమిళనాడు

by  |
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.. ఫైనల్లో తమిళనాడు
X

దిశ, స్పోర్ట్స్ : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి విజేత తమిళనాడు వరుసగా రెండో సారి ఫైనల్‌లోకి ప్రవేశించింది. గత ఏడాది ఫైనల్స్ చేరిన తమిళనాడు జట్టు కర్నాటకపై ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాజస్జాన్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆధిపత్యం చెలాయించి మరోసారి ఫైనల్స్ చేరింది. మరోవైపు రాజస్థాన్ జట్టు చివరి వరకు మ్యాచ్‌పై పట్టు నిలుపుకున్నా.. ఓటమి చవిచూసింది.

రాజస్థాన్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించలేదు. రాజస్థాన్ బౌలర్ల ధాటికి ఓపెనర్ హరి నిషాంత్‌తో పాటు క్వార్టర్ ఫైనల్ హీరో బాబా అపరాజిత్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఓపెనర్ హరి నిషాంత్ (4) తన్వీర్ ఉల్ హక్ బౌలింగ్‌లో LBWతో వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే అనికెత్ చౌదరి బౌలింగ్‌లో బాబా అపరాజిత్ (2) బిష్ణోయ్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

అప్పటికి తమిళనాడు స్కోర్ 17 మాత్రమే. రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తమిళనాడును నారాయణ్ జగదీషన్ (28), అరుణ్ కార్తీక్ కలసి ఆదుకున్నారు. వీరిద్దరూ కలసి రాజస్థాన్ బౌలర్లపై దాడి ప్రారంభించారు. ఆచితూచి ఆడుతూ స్కోరును పెంచారు. జగదీషన్ కాస్త నెమ్మదిగా ఆడినా.. అరుణ్ కార్తీమ్ మాత్రం బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. వీరిద్దరూ కలసి మూడో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. ఈ క్రమంలో జగదీషన్ (28) రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో లామ్రోర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఆ తర్వాత ఇద్దరు కార్తీక్‌లకు రాజస్థాన్ బౌలర్లకు అవకాశమే ఇవ్వలేదు. ఒకవైపు అరుణ్ కార్తీక్ బౌండరీలు, సిక్సులతో చెలరేగుతుండగా.. కెప్టెన్ దినేష్ కార్తీక్ తనదైన సహాయం అందించాడు. అరుణ్ కార్తీక్ కేవలం 54 బంతుల్లో 89 పరుగులు చేయగా.. దినేష్ కార్తీక్ 17 బంతుల్లో 26 పరుగులు చేశారు. వీరిద్దరూ అజేయంగా 89 పరుగులు చేయడంతో తమిళనాడు జట్టు 7 వికెట్లు తేడాతో సెమీస్‌లో విజయం సాధించి వరుసగా రెండో సారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో అడుగు పెట్టింది. తన్వీర్ ఉల్ హక్, అనికెత్ చౌదరి, రవి బిష్ణోయ్ తలా ఒక వికెట్ తీశారు.

ఆదుకున్న అర్జిత్..

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. రాజస్థాన్ జట్టుకు తొలి ఓవర్లోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ భరత్ శర్మ (0) ఇన్నింగ్స్ నాలుగో బంతికే డకౌట్ అయి పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ ఆదిత్య గెహ్ర‌వాల్, కెప్టెన్ అశోక్ మెనారియా కలసి సమయోచితమైన ఇన్నింగ్స్ ఆడారు. ఆదిత్ దూకుడుగా ఆడి రాజస్థాన్ స్కోర్ పెంచడానికి ప్రయత్నించాడు.. ఆ క్రమంలో ఆదిత్య (29) అపరాజిత్ బౌలింగ్‌లొ అరుణ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత అశోక్ (51), అర్జిత్ (45) కలసి రాజస్థాన్ జట్టును ఆదుకున్నారు.

వీరిద్దరూ తమిళనాడు బౌలర్లపై ఆధిపత్యం చెలాయించి బౌండరీలు, సిక్సులు బాదుతూ స్కోర్ పెంచారు. వీరిద్దరూ కలసి మూడో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. కాగా, అశోక్ మనేరియా అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత సాయి కిషోర్ బౌలింగ్‌లో అరుణ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వీరి జోడి విడిపోయిన తర్వాత అర్జిత్ గుప్తాకు సరైన సహకారం అందలేదు. రాజేష్ బిష్ణోయ్ (12) తప్ప మరో బ్యాట్స్‌మెన్ సహకరించకపోవడంతో.. భారీ స్కోర్ సాధించాల్సిన రాజస్థాన్ చివరి ఓవర్లలో డీలా పడింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 కోల్పోయి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. తమిళనాడు బౌలర్లలో మొమహ్మద్ 4, సాయి కిషోర్ 2 వికెట్లు తీయగా.. సోనూ యాదవ్, బాబా అపరాజిత్, మురుగన్ అశ్విన్ తలా ఒక వికెట్ తీశారు.

స్కోర్ బోర్డు:

రాజస్థాన్

భరత్ శర్మ (సి) అపరాజిత్ (బి) సాయి కిషోర్ 0, ఆదిత్య గెహ్రవాల్ (సి) అరుణ్ కార్తీక్ (బి) అపరాజిత్ 29, అశోక్ మనేరియా (సి) అరుణ్ కార్తీక్ (బి) సాయి కిషోర్ 51, అర్జిత్ గుప్తా (సి) అశ్విన్ క్రిస్ట్ (బి) మురుగన్ అశ్విన్ 45, మహిపాల్ లామ్రోర్ (సి) మురుగన్ అశ్విన్ (బి) మొహమ్మద్ 3, రాజేష్ బిష్ణోయ్ (సి) అరుణ్ కార్తీక్ (బి) సోనూ యాదవ్ 12, చంద్రపాల్ సింగ్ (సి) హరి నిషాంత్ (బి) మొహమ్మద్ 2, తన్వీర్ ఉల్ హక్ 2 నాటౌట్, రవి బిష్ణోయ్ (బి) మహమ్మద్ 0, అనికెత్ చౌదరి (సి) అరుణ్ కార్తీక్ (బి) మహమ్మద్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లు) 154/9

వికెట్ల పతనం : 1-0, 2-37, 3-120, 4-129, 5-142, 6-152, 7-153, 8-154, 9-154

బౌలింగ్ : సాయి కిషోర్ (4-0-16-2), సోనూ యాదవ్ (4-0-27-1), అశ్విన్ క్రిస్ట్ (2-0-29-0), బాబా అపరాజిత్ (2-0-20-1), మురుగన్ అశ్విన్ (4-0-35-1), మొహమ్మద్ (4-0-24-0)

తమిళనాడు

హరి నిషాంత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) తన్వీర్ ఉల్ హక్ 4, నారాయన్ జగదీషన్ (సి) లామ్రోర్ (బి) రవి బిష్ణోయ్ (28), బాబా అపరాజిత్ (సి) రాజేష్ బిష్ణోయ్ (బి) అనికెత్ చౌదరి 2, అరుణ్ కార్తీక్ 89 నాటౌట్, దినేష్ కార్తీక్ 26 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (18.4 ఓవర్లు ) 158/3

వికెట్ల పతనం : 1-14, 2-17, 3-69

బౌలింగ్ : తన్వీర్ ఉల్ హక్ (3-0-22-1), అనికెత్ చౌదరి ( 3.4-0-29-1), ఖలీల్ అహ్మద్ (4-0-33-0), చంద్రపాల్ సింగ్ (4-0-42-0), రవి బిష్ణోయ్ ( 4-0-32-1

Next Story

Most Viewed