సినీ కార్మికులను ఆదుకునే తమిళ్ ‘నవరస’

by  |
సినీ కార్మికులను ఆదుకునే తమిళ్ ‘నవరస’
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమిళ సినీ కార్మికులను ఆదుకునేందుకు కోలీవుడ్ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. ‘నవరస’ పేరుతో సిరీస్‌ ప్లాన్ చేసిన ఇండస్ట్రీ.. నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనుంది. తద్వారా వచ్చిన డబ్బును సినీ వర్కర్ల కోసం ఉపయోగించనుంది. తొమ్మిది షార్ట్ ఫిల్మ్స్ సంకలనంగా వస్తున్న సిరీస్‌ను మణిరత్నం, జయేంద్ర పంచపకేసన్ నిర్మించగా.. బెజాయ్ నంబియార్, అరవింద్ స్వామి, గౌతమ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజు, కార్తీక్ నరేన్, కేవీ ఆనంద్, పొన్రం, రతీంద్రన్ ప్రసాద్, హలిత షమీన్ డైరెక్ట్ చేశారు.

నైన్ ఎమోషన్స్.. నైన్ స్టోరీస్.. వన్ ఇండస్ట్రీ.. ఫర్ ద పీపుల్.. టాగ్ లైన్‌తో వస్తున్న సిరీస్ గురించి, దీని వెనకున్న ఉద్దేశం గురించి చెప్పగానే నటీనటులు, టెక్నిషియన్స్ కూడా త్వరగా స్పందించి సహకరించారని తెలిపారు నిర్మాతలు. సినీ వర్కర్లను ఆదుకునేందుకు వారు అందించిన సహకారానికి అభినందనలు తెలిపారు. కాగా ఈ సిరీస్‌లో అరవింద స్వామి, సూర్య, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, రేవతి, నిత్యా మీనన్, పార్వతి తిరువోతు, ఐశ్వర్య రాజేష్, పూర్ణ, ప్రసన్న, గౌతమ్ కార్తీక్, రోబో శంకర్‌తో పాటు పలువురు నటించగా.. పట్టుకొట్టై ప్రభాకర్, సెల్వ, మదన్ కార్కి, సోమీదరన్ రచయితలు. ఇక ఈ తొమ్మిది కథలకు ఏఆర్ రెహమాన్, డి ఇమాన్, జిబ్రన్, అరుల్ దేవ్, కార్తీక్, రోన్ ఏతన్ యోహన్, గోవింద్ వసంతన్, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు.



Next Story

Most Viewed