తమిళనాడు, పుదుచ్చేరిలోనూ.. పది పరీక్షలు రద్దు

by  |
తమిళనాడు, పుదుచ్చేరిలోనూ.. పది పరీక్షలు రద్దు
X

చెన్నై: తమిళనాడు, పుదుచ్చెరీ ప్రభుత్వాలు సైతం తెలంగాణ తరహాలోనే పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలను ఫణంగా పెట్టలేమని వెల్లడించాయి. ఈ మేరకు త్రైమాసిక, అర్ధవార్షిక పరీక్షల్లో సాధించిన మార్కులతో పాటు, హాజరు ఆధారంగా 10, 11వ తరగతి విద్యార్థులను నేరుగా పై తరగతులకు ప్రమోట్ చేయనున్నట్టు తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటించారు. అయితే, 12వ తరగతి పరీక్షలు మాత్రం పరిస్థితులు అదుపులోకి రాగానే నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కాగా, తమిళనాడులో ఈ నెల 15 నుంచి 10వ తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 33,229 కేసులు, 286 మరణాలతో దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సైతం ఇదే నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, విద్యార్థులను నేరుగా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు పుదుచ్చెరి సీఎం వి.నారాయణసామి ప్రకటించారు.

Next Story

Most Viewed