‘మాస్టర్‌’‌కు ఊరట.. థియేటర్‌లో సీటింగ్ శాతం పెంపు

by  |
‘మాస్టర్‌’‌కు ఊరట.. థియేటర్‌లో సీటింగ్ శాతం పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు కరోనా వ్యాక్సిన్ కూడా వస్తుండటంతో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో సీటింగ్ సామర్థ్యాన్ని 100శాతానికి పెంచుతూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు (సోమవారం) ఉత్తర్వు జారీచేసింది. దేశంలో మొట్టమొదట తమిళనాడు ప్రభుత్వమే.. పొంగల్ పండుగకు వారం రోజుల ముందు సినిమాహాళ్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వడం విశేషం. అధిక ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వాలని థియేటర్ యజమానుల సంఘాలు చేసిన విజ్ఞప్తుల మేరకు అక్కడి సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సంక్రాంతికి విడుదల కానున్న విజయ్ ‘మాస్టర్’ చిత్రానికి మేలు కలగనుంది.

కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు, సామాజిక దూరం పాటించేలా.. సినిమా థియేటర్లలో 50శాతం సీటింగ్ కెపాసిటీకే అనుమతులున్నాయి. కాగా ప్రస్తుతం తమిళనాడులో 100 శాతం సీటింగ్‌కు అనుమతి లభించడంతో.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో కూడా 100 శాతం సీటింగ్ సామర్థ్యానికి అనుమతినివ్వాలని నిర్మాతలు కోరుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఫిల్మ్‌చాంబర్ లేఖలు రాసినట్టు తెలుస్తోంది. ఈ సంక్రాంతికి ‘క్రాక్, రెడ్, అల్లుడు అదుర్స్, బంగారు బుల్లోడు, మాస్టర్’ వంటి సినిమాలు విడుదలవుతుండటంతో సీటింగ్ సామర్థ్యం పెంచితేనే సినీ పరిశ్రమ లాభపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story

Most Viewed