జాతీయ స్థాయి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రద్దు చేయండి : సీఎం లేఖ

by  |
జాతీయ స్థాయి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రద్దు చేయండి : సీఎం లేఖ
X

చెన్నై: కరోనా పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేశామని, విద్యార్థుల యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. అదే కారణంతో నీట్ సహా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలన్నింటినీ రద్దు చేయాలని ప్రధానికి లేఖ రాసి డిమాండ్ చేశారు. 12వ తరగతి విద్యార్థుల ఫలితాలను నిర్ధారించడానికి ప్రత్యేకంగా కమిటీ వేశామని, ఆ కమిటీనే విద్యార్థలు ఫలితాలను వెల్లడిస్తుందని అందులో పేర్కొన్నారు.

ఆ మార్కుల ఆధారంగా ప్రొఫెషనల్, ఆర్ట్స్, సైన్స్ కోర్సుల్లో అడ్మిషన్లు ఇస్తామని వివరించారు. బోర్డు పరీక్షలు రాయడానికి విద్యార్థులకు రిస్క్ ఉన్నట్టే ప్రవేశ పరీక్షలు రాయడానికి ముప్పు అంతే ఉంటుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కాబట్టి, నీట్ సహా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలన్నింటినీ విద్యార్థుల ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ రాష్ట్రంలో 12వ తరగతి మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్ సహా అన్ని ప్రొఫెషనల్ సీట్లను ఫిల్ చేస్తామని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed