తమన్నాకి తగ్గని కరోనా..

by  |
తమన్నాకి తగ్గని కరోనా..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా కరోనా నుండి పూర్తిగా కోలుకోనప్పటికీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఒక పోస్ట్ చేశారు. నేను నా టీం సెట్స్ లో తగు జాగ్రత్తలు పాటించినప్పటికీ దురదృష్టవశాత్తు కరోనా సోకింది. కొద్దిగా జ్వరంగా ఉందని పరీక్ష చేయించుకోగా నాకు కరోనా ఉందని నిర్ధారణ అయింది.

అనంతరం నేను ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో మెరుగైన చికిత్స కోసం అడ్మిట్ అయ్యాను. వారం రోజుల ట్రీట్మెంట్ తర్వాత కొద్దిగా ఉపశమనం కలగడంతో ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాను. డాక్టర్ల సలహా మేరకు మరికొంతకాలం హోమ్ ఐసోలేషన్ లో ఉండబోతున్నాను. త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని నాకు నమ్మకం ఉంది. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తమన్నా ఓ పోస్ట్ చేశారు.

Next Story

Most Viewed