NETFLIX నుంచి కొత్త సిరీస్.. RAW ఏజెంట్‌గా టబు

by  |
Netflix
X

దిశ, సినిమా : నెట్‌ఫ్లిక్స్ ఇండియా కొత్త సిరీస్ ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ థ్రిల్లర్‌గా వస్తున్న సిరీస్‌కు విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. టబు, అలీ ఫజల్, ఆశీష్ విద్యార్థి, వామికా గబ్బి ప్రధానపాత్రల్లో నటించనున్నారు. ఈ సిరీస్‌కు ‘ఖుఫియా’ టైటిల్ ఫైనలైజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్.. అమర్ భూషణ్ రాసిన ‘ఎస్కేప్ టు నోవేర్’ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపింది.

కాగా టబు-విశాల్ భరద్వాజ్ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘మక్బూల్’, ‘హేదర్’ చిత్రాలు రాగా ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. ఇండియాస్ డిఫెన్స్ సీక్రెట్స్‌ను శత్రుదేశానికి ఎవరు చేరవేస్తున్నారని తెలుసుకునేందుకు నియమించబడిన రా ఏజెంట్ కృష్ణ మెహ్రా కథే స్టోరీ కాగా.. ఈ క్యారెక్టర్‌లో కనిపించబోతోంది టబు.


Next Story

Most Viewed