తాప్సీ నటన అద్భుతం : మార్కండేయ ఖట్జూ

by  |
తాప్సీ నటన అద్భుతం : మార్కండేయ ఖట్జూ
X

బాలీవుడ్‌లో ప్రస్తుతం నెపోటిజం గురించి హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కొందరు బాలీవుడ్ నటీమణులపై కంగనా ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అందులో తాప్సీ కూడా ఒకరు. తాప్సీని బీ గ్రేడ్ ఆర్టిస్ట్ అంటూ కంగనా కామెంట్ చేయడంతో.. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే, తాప్సీ నటనపై కంగనా చేసిన విమర్శలకు సమాధానంగా.. ప్రముఖ లాయర్ మార్కండేయ ఖట్జూ స్పందించారు. తాప్సీ నటనను అభినందించడంతో పాటు ప్రశంసలు కురిపించారు.

‘తాప్సీ గ్రేట్ ఆర్టిస్ట్. నాకు ఇప్పుడు 74 సంవత్సరాలు.. 40 సంవత్సరాలుగా బాలీవుడ్‌లో ఏ సినిమా చూడలేదు. కాలిఫోర్నియాలో ‘ముల్క్’ సినిమా మాత్రం చూశాను. అందులో తాప్సీ నటన అద్భుతం. రిషి కపూర్ నటన కూడా సూపర్బ్. లాయ‌ర్‌గా హైకోర్టు, సుప్రీం కోర్టులో 20 ఏళ్లు ప‌ని చేశాను. ఎంతో మంది లాయ‌ర్లను చూశాను. వారి బాడీ లాంగ్వేజ్ మాదిరిగానే ‘ముల్క్’ సినిమాలో నీ న‌టన అద్భుతంగా ఉంది. నీవు పోషించిన పాత్ర వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఉంది’ అని మార్కండేయ ఖట్జూ ట్వీట్ చేశారు. దీనికి తాప్సీ థ్యాంక్యూ సో మచ్ సార్ అని రీట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమాలో నటించటానికి ముందు నువ్వు ఎవరైనా లాయర్ వద్ద సలహాలు.. సూచనలు తీసుకున్నావా? అని కట్జూ ప్రశ్నించారు. అందుకు తాప్సీ.. ‘అవును సార్.. ఒక న్యాయవాది వద్ద శిక్షణ పొందాను’ అని పేర్కొంది. కాగా, ముల్క్ సినిమా 2018లో విడుదలైంది. కుటుంబంలో ఒకరు చేసిన తప్పుకు ఫ్యామిలీ మొత్తాన్ని టెర్రరిస్టులుగా ముద్ర వేయకూడదనే ఇతివృత్తంతో సాగే ఈ సినిమాకు అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. ఇందులో తాప్సీ, రిషి కపూర్, రజత్ కపూర్‌ లీడ్ రోల్స్ పోషించారు.

Next Story