తాప్సీ పన్ను ‘మర్డర్ మిస్టరీ’..

by  |
తాప్సీ పన్ను ‘మర్డర్ మిస్టరీ’..
X

దిశ, సినిమా : బాలీవుడ్‌లో సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్న హీరోయిన్ తాప్సీ పన్ను ఓటీటీలో ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది. ‘హసీన్ దిల్‌రుబా’గా త్వరలో ఆడియన్స్‌ను మీట్ కాబోతోంది. వినిల్ మాథ్యూ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాను కలర్ ఎల్లో ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎరోస్ ఇంటర్నేషనల్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఆనంద్ ఎల్ రాయ్. విక్రాంత్ మాసే, హర్షవర్ధన్ రాణే ప్రధానపాత్రల్లో కనిపించబోతున్న సినిమా జూలై 2న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. సోషల్ మీడియాలో టైటిల్ మాంటేజ్ క్లిపింగ్ షేర్ చేసిన మూవీ యూనిట్.. మర్డర్ మిస్టరీగా తెరకెక్కుతున్న ట్విస్టెడ్ లవ్ స్టోరీ ఆడియన్స్ కచ్చితంగా ఇంప్రెస్ట్ చేస్తుందన్నారు. ఎడ్జీ స్క్రిప్ట్‌తో ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తుందని తెలిపారు.

Next Story

Most Viewed