మరికొన్ని గంటల్లో ప్రపంచకప్ ఫైనల్.. సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

by  |
మరికొన్ని గంటల్లో ప్రపంచకప్ ఫైనల్.. సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మరికొన్ని గంటల్లో టీ20 ప్రపంచకప్ మ్యా్చ్ జరుగనుండగా.. భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ ఫైనల్ మ్యాచ్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఏ జట్టు గెలుస్తుందో గవాస్కర్ తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్-2021 ఫైనల్‎లో ఆస్ట్రేలియా గెలిచే అకాశం ఉందని స్పష్టం చేశారు. 2010లో నెరవేరని కలను ఈసారి ఆస్ట్రేలియా సాకారం చేసుకోబోతుందని జోస్యం చెప్పారు. అంతేగాకుండా.. కంగారుల జట్టు చాలాసార్లు న్యూజిలాండ్‌పై ఆధిపత్యం చెలాయించిందని గుర్తుచేశారు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు 14 సార్లు తలపడ్డాయి. అందులో 9 సార్లు ఆసీస్ జట్టు గెలుపొందగా, నాలుగింటిలో మాత్రమే కివీస్ విజయం సాధించిందని తెలిపారు. కాగా, ఇవాళ జరిగే టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ మ్యాచ్ రాత్రి 07:30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

Next Story