రేపు సదర్‌మాట్ ప్రాజెక్ట్ వద్ద జలదీక్ష

by  |
రేపు సదర్‌మాట్ ప్రాజెక్ట్ వద్ద జలదీక్ష
X

దిశ, ఆదిలాబాద్: జల దీక్ష పేరుతో చేపడుతున్న ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా శనివారం కాంగ్రెస్ నేతలు నిర్మల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈనేపథ్యంలో సదర్ మాట్ ప్రాజెక్ట్ వద్ద నేతలు నిరసన తెలియజేయనున్నారు. నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాలకు సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టారు. అయితే నిధుల లేమితో ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయింది. వెంటనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి, భూ నిర్వాసితులకు పరిహారం అందించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ నేతలు జలదీక్ష చేపట్టనున్నారు.

ఈ కార్యక్రమానికి టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరవుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అయితే జిల్లాలో కాంగ్రెస్ నేతల పర్యటనకు అనుమతి లభించడం అనుమానమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story

Most Viewed