4గురు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్.. అలా చేయడం వల్లే..!

71
suspended

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట డివిజన్ పరిధిలోని గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తున్నట్టు కలెక్టర్ ఉదయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారని డీపీఓ కృష్ణ తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో పాటు విధుల నిర్వహణలో అలసత్వం వహించిన కారణంగా అచ్చంపేట పరిధిలోని ఆంజనేయ తాండ రాజశేఖర్, అక్కిరోని పల్లి ఆంజనేయులు, బల్మూర్ పరిధిలోని జీను కుంట కార్యదర్శి శివ లీల, ఉప్పునుంతల మండలంలోని సదా గోడు కార్యదర్శి వెంకటేష్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. అలాగే ఇద్దరి సర్పంచులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.