ఆ జడ్జీకి భద్రత అనవసరం: సుప్రీం

by  |
ఆ జడ్జీకి భద్రత అనవసరం: సుప్రీం
X

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర కేసు తీర్పు వెలువరించిన సీబీఐ మాజీ ప్రత్యేక న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్‌కు సెక్యూరిటీ కవర్‌ను పొడిగించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. తనకు కల్పించిన భద్రతను మరికొంత కాలం పొడిగించాలని కుమార్ దాఖలు చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి ఆర్ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. కుమార్ రాసిన లేఖను పరిశీలించిందని, కానీ, అతనికి సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరమున్నట్టు భావించడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. సెప్టెంబర్ 30న బాబ్రీ కేసులో 32 మంది నిందితులను(అందరిని) నిర్దోషులుగా ప్రకటిస్తూ 2,300 పేజీల తీర్పును అప్పటి సీబీఐ స్పెషల్ జడ్జీ సురేంద్ర కుమార్ యాదవ్ వెలువరించిన సంగతి తెలిసిందే.

Next Story