ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల పిటిషన్లను కలిపే విచారించనున్న సుప్రీం

by  |
ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల పిటిషన్లను కలిపే విచారించనున్న సుప్రీం
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రపంచాయితీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఎన్నికలతో సంబంధం ఉన్న అన్నీ కేసులు సంజయ్ కౌల్ ధర్మాసనానికి బదిలీ అయ్యాయి. అయితే విచారణ జరపాల్సిన జాబితాలో ఉద్యోగసంఘాల పిటిషన్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సుప్రీం కోర్ట్ లో ఎన్నికలకు సంబంధించి జస్టిస్‌ లావు నాగేశ్వరరావుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంది. అయితే కొన్ని అన్వేక కారణాల వల్ల ఈ పిటిషన్లను జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు 39వ నంబర్ రాగా.. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్‌ కేసుల వరుసలో 40వ నంబరు ఇచ్చారు. ఈ రెండు పిటిషన్లను కలిపే ధర్మాసనం విచారించనుంది.

Next Story

Most Viewed