మే14 కాదు..10 నుంచే సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు : జస్టిస్ ఎన్వీ రమణ

by  |
supreme court
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కొవిడ్ విజృంభణ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు నాలుగు రోజుల ముందుగానే ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ దేశ రాజధానిలో తీవ్ర రూపం దాలుస్తోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు పలువురు కేంద్ర మంత్రులతో సహా ఎంపీలు, ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే.

COVID-19 వ్యాప్తి దృష్ట్యా భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) NV రమణ శనివారం సుప్రీంకోర్టు వేసవి విరామ తేదీని మే 14కు బదులు మే-10 నుంచే ఉంటాయని ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు అత్యున్నత న్యాయస్థానం పూర్తి సభ్యుల బెంచ్ అంగీకరించింది. జూన్ 27న వేసవి సెలవుల తర్వాత కోర్టు తిరిగి తెరవబడుతుందని సుప్రీం కోర్టు జారీ చేసిన సర్క్యులర్ తెలిపింది.


Next Story

Most Viewed