ఆదివారం పంచాంగం, రాశి ఫలాలు(13-06-2021)

248
Panchangam

సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : ఆదివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : తదియ
(నిన్న రాత్రి 8 గం॥ 16 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 9 గం॥ 37 ని॥ వరకు)
నక్షత్రం : పునర్వసు
(నిన్న సాయంత్రం 4 గం॥ 56 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 6 గం॥ 58 ని॥ వరకు)
యోగము : వృద్ధి
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 57 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 41 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 5 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 4 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 56 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 49 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 10 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 53 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 50 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : మిథునము

రాశి ఫలాలు..

మేష రాశి..

అన్నివిధాలా అనుకూలమైన రోజు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. సరైన కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. దైవ ప్రార్ధన మీకు సరైన ఆలోచన ఇస్తుంది. సంఘంలో పేరుప్రతిష్టలు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమంది నూతన వాహనాలు కొంటారు. ప్రేమికులు పెళ్లిపీటలు ఎక్కుతారు. ఆఫీసులో మీ పని సామర్థ్యం అందరి మెప్పును పొందుతుంది. కావలసినంత ధనం చేతికందుతుంది. పాతబాకీలు తీర్చడం వలన డబ్బుకు ఇబ్బంది. అప్పులు చెయ్యకండి. ఈ రాశి స్త్రీలు ఇంట్లో శుభకార్యాల కై మీ భర్తతో చర్చిస్తారు.

వృషభ రాశి..

ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. చిన్ననాటి స్నేహితులతో కలిసి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ఆదాయం పరవాలేదు. పాతబాకీలు వసూలవుతాయి. ఆఫీసు పనిలో అధిక శ్రమ, చికాకులు. సరైన ప్రణాళికతో పనులు పూర్తి చేయండి. ప్రేమికులు పెళ్లి పీటలు ఎక్కుతారు. అతి విశ్రాంతి వలన సోమరితనం. యాక్టివ్ గా ఉండటానికి యోగా మెడిటేషన్ చేయాలి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారు. దీని వలన సరైన ఆలోచనలు వస్తాయి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మిధున రాశి..

అన్నివిధాలా అనుకూలమైన రోజు. దీర్ఘకాలిక రోగం నయం అవుతుంది. ఆదాయం బాగుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. దీని కొరకు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్న రుణం మంజూరు అవుతుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారు. పరులకు సహాయం చేయండి కానీ వారి వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవద్దు. కొత్త వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. కొంతమందికి విదేశీ ప్రయాణ అవకాశం. ఈ రాశి స్త్రీలకు కుటుంబ ఖర్చుల గురించి మీ భర్తతో చిన్న గొడవలు జరగవచ్చు. జాగ్రత్త.

కర్కాటక రాశి..

మీ సహోదరులతో కుటుంబ విషయాలు మాట్లాడతారు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. మీ భార్యతో గొప్ప కోతలు కొయ్యకండి తర్వాత ఇబ్బంది పడతారు. ఆఫీసులో పనులు పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. విద్యార్థులు స్నేహితులతో కబుర్లతో సమయం వృధా చేయకండి. కొంత మంది విద్యార్థులకు ఇది భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం. జాగ్రత్త. మరింత సంపాదన కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క హాస్యచతుర సంభాషణ మిమ్మల్ని సంతోషపరుస్తుంది.

సింహరాశి..

స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. పెళ్లి కాని వారికి సంబంధం కుదురుతుంది. ఆదాయం బాగుంది దానధర్మాలు చేయండి మీకు దైవ బలం లభిస్తుంది. మీ ఇంటి లోకి కొత్తగా పాప /బాబు రాబోతున్నారు వారికి పేరు వెతకండి. కుటుంబ సమస్యల మీద అందరు సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి పెద్ద వారి సలహాలు తీసుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మిమ్మల్ని పూర్తిగా సంతోషపరుస్తుంది.

తులారాశి..

ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. కొంతమంది ఇంటిలో కొత్తగా పాప /బాబు రాబోతున్నారు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. వివాహం కాని వారికి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు చదువు మీద సరైన శ్రద్ధ పెడితే విజయం మీదే. స్థిరాస్తి అమ్మకాలు ఒక కొలిక్కి వస్తాయి లాభాలను తెస్తాయి. ఆఫీసు పని మీద శ్రద్ధ పెట్టండి తప్పులు జరగకుండా చూసుకోండి. బయటి భోజనం వల్ల అజీర్తి. అనవసర పనికిమాలిన విషయాల గురించి ఆలోచించడం వల్ల సమయం వృధా. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపక పోవటం వలన మానసిక అశాంతి

 కన్యారాశి..

ప్రముఖ వ్యక్తుల పరిచయం. ముఖ్యమైన నిర్ణయాలలో వారి సలహా తీసుకుంటారు. ఆర్థిక అవసరాల కోసం చిన్న అప్పులు చేయవలసి రావచ్చు. మీ హాస్యచతుర సంభాషణను అందరూ ప్రశంసిస్తారు. ఆఫీసు మనలను చాకచక్యంగా పూర్తిచేస్తారు. కొంతమందికి ఉద్యోగ మార్పు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి ఫిట్ నెస్ ను పెంచుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ సమస్య మనసు విప్పి చెప్పుకోవటానికి సరైన ఆత్మీయులు లేరు అని బాధ పడతారు.

వృశ్చిక రాశి..

అదనపు బాధ్యతల వలన అధిక శ్రమ పడవలసి వస్తుంది. ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు. సరైన సమయమునకు భోజనం చేయకపోవడం వలన ఆరోగ్యపరమైన చికాకులు. కావాల్సినంత ధనం చేతికందుతుంది. సరైన పెట్టుబడుల లో పెట్టండి. రియల్ ఎస్టేట్ ఒక మంచి ఉపాయం. ప్రతి ఒక్కరిని తప్పుపట్టడం మానండి. మీకు ఆత్మీయులు మిగలరు మరియు సమయం వృధా. కుటుంబ సభ్యులతో మనసువిప్పి మాట్లాడతారు ఆనందంగా గడుపుతారు. ఆఫీసు పనులను చాకచక్యంగా పూర్తి చేస్తారో పై అధికారుల మెప్పు పొందుతారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

ధనుస్సు రాశి..

అన్నివిధాలా అనుకూలమైన రోజు. పట్టుదలతో అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు. రోజువారీ పనులను పక్కనపెట్టి ఈ రోజు పూర్తిగా రిలాక్స్ అవుదామని అనుకుంటున్న వారు ఆ పని చేయవచ్చు. కొంతమందికి ఇంటి మార్పు. కుటుంబ విషయాల మీద తండ్రి గారి సలహా తీసుకోండి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు ఆఫీసు పనులను చాకచక్యంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. కావాల్సినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు పాత గొడవలను మర్చిపోయి నీ భర్తతో ఆనందంగా గడపండి.

మకర రాశి..

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అన్నివిధాలా అనుకూలమైన రోజు. డబ్బు పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. కొంతమంది ఇంటి లో కొత్తగా పాప/ బాబు రాబోతున్నారు. ఆశావహ దృక్పథంతో ఉండడం వలన మీ ఆశయాలను నెరవేర్చుకోవడానికి కావలసిన మార్గాలు దొరుకుతాయి. ఉద్యోగము లేక వ్యాపార పరంగా ప్రయాణం లాభిస్తుంది. ఆఫీస్ పనులను చాకచక్యంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. కావాల్సినంత ధనం చేతికందుతుంది పొదుపు చేయండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

కుంభరాశి..

గందరగోళం వదిలేయండి సహనంతో ఆలోచించండి. దూరపు ప్రయాణాలను వీలైతే వాయిదా వేయండి. స్థిరాస్తి అమ్మకం విషయంలో అనుకున్న లాభాలు. భార్య భర్తల మధ్య గొడవలు సర్దుకుంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విద్యార్థులు మొబైల్ టీవీలను వదిలేయండి. దానివల్ల సమయం వృధా. కొంతమందికి ఇల్లు మార్పు. మీ హాస్య చతురత సంభాషణ కుటుంబ సభ్యులను ఆనంద పరుస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. అదనపు బాధ్యతల వలన ఆఫీసు పనిలో అధిక శ్రమ ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మీన రాశి..

కొత్త ఎనర్జీ తో పట్టుదలతో పని చేయవలసి వస్తుంది. కొంతమందికి ప్రపంచాన్ని వదిలివేసి ఒంటరిగా బతకాలని పిస్తుంది. నిరాశావాద ధోరణి వదిలి వేయండి. మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. ఆదాయ వ్యవహారాలు మెరుగు పడతాయి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. అనవసరపు భయాందోళనలను వదిలి వేయండి. ఆఫీసు పనిలో అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ ఒత్తిడి. ఈ రాశి స్త్రీలకు కుటుంబంలో మీ విలువను మీ భర్త తెలుసుకుంటారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..