ఫీజులు కట్టక పోతే నో ఎంట్రీ.. ఆందోళనలో తల్లిదండ్రులు..

by  |
ఫీజులు కట్టక పోతే నో ఎంట్రీ.. ఆందోళనలో తల్లిదండ్రులు..
X

దిశ, శేరిలింగంపల్లి: విద్యార్థుల భవిష్యత్తు కంటే తమకు ఫీజులే ముఖ్యమని, ఫీజులు కట్టేంత వరకు పరీక్షలకు అనుమతించబోమని తేల్చిచెప్పింది వివేకానంద నగర్ డివిజన్ లోని అవినాష్ కాలేజి యజమాన్యం. గురువారం అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో ఫీజ్ పెండింగ్ ఉందని విద్యార్థులను పరీక్ష హాలు నుండి బయటికి పంపించారు. ఫీజులు కడితే తప్పా లోపలికి అనుమతించబోమని తేల్చిచెప్పారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

వీరికి మద్దతుగా శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు ఏకాంత్ గౌడ్ విద్యార్థులతో పాటు నిరసనకు దిగారు. విద్యార్థుల ఆందోళనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అవినాష్ కాలేజీ ఆఫ్ కామర్స్ యాజమాన్యం సెక్యూరిటీ పేరుతో బౌన్సర్లను ఏర్పాటు చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. విద్యార్థుల ఫీజ్ పెండింగ్ ఉన్నంత మాత్రాన వారిని పరీక్షలు రాయించకుండా మధ్యలో నుండి బయటకు పంపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి కార్పొరేట్ యాజమాన్యాలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినాష్ కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులను పరీక్షలు రాయించేలా ఏర్పాటు చేశారు.

Next Story

Most Viewed