పరీక్షలకు రెడీగా ఉండాలి: సుప్రీంలో యూజీసీ

by  |
supreme court notices to twitter
X

న్యూఢిల్లీ: ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్‌కు విద్యార్థులు ప్రిపేర్ అవుతూనే ఉండాలని యూజీసీ సూచించింది. కరోనాతో వాయిదా పడిన పరీక్షలు సుప్రీంకోర్టు విచారణ తర్వాత మరోసారి వాయిదా పడతాయని భావించొద్దని తెలిపింది. విద్యార్థులు ప్రిపేర్ అవుతూనే ఉండాలని, పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే విధిస్తుందనే భావనలో ఉండొద్దని సూచించింది. కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థలకు సంబంధించి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని యూజీసీ చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ శివసేన యువజన విభాగం యువసేన సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎంఆర్ షాల త్రిసభ్య ధర్మాసనం వాదనలు విన్నది.

శుక్రవారం ఈ పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం ఎటువంటి ఆదేశాలు జారీ చేయకుండా విచారణను ఆగస్టు 10నాటికి వాయిదా వేసింది. ప్రభుత్వ కాలేజీల్లో ఈ పరీక్షలను రద్దు చేస్తూ మహారాష్ట్ర తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన సమగ్ర వివరాలను కోర్టుకు అందజేయాలని సూచించింది. అలాగే, కేంద్ర హోం శాఖ దీనిపై స్పష్టమైన నిర్ణయాన్ని తెలియజేయాలని ఆదేశించగా, ఆగస్టు 3లోగా వివరిస్తామని కేంద్రం తెలిపింది. ఆన్‌లైన్‌లోనూ పరీక్షలు హాజరుకావొచ్చన్న సూచనను ఓ పిటిషనర్ తరఫున వాదిస్తున్న న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ అభ్యంతరం తెలిపారు. యూనివర్సిటీలన్నింటిలో ఆ సౌకర్యాలు లేవని, అదీగాక కొందరు పరీక్షలు హాజవ్వకుండా తర్వాత రాద్దామని ఎంచుకున్నా గందరగోళం ఏర్పడుతుందని అన్నారు.

Next Story