విద్యార్థులు స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఆసక్తి పెంచుకోవాలి

by  |
Pardhasaradi
X

దిశ, నిజామాబాద్ రూరల్: రాష్ట్రంలోని ప్రతి పాఠశాల, యూనివర్సిటీల్లో విద్యార్థులు స్కిల్ డెవలప్ మెంట్స్ పై శ్రద్ధ చూపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పునరుద్ఘాటించారు. గురువారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలం కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీ ఫౌండేషన్ డే సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ఈ సమావేశానికి పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి దశలో ఒడిదుడుకులు సహజమేనని అన్నారు. తన సొంత ఊరు ఆర్మూర్ పట్టణంలోని పదవ తరగతి వరకు చదివానని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. యూనివర్సిటీలో చదువుతున్న ప్రతి విద్యార్థికి స్కిల్ డెవలప్మెంట్ గురించి తెలిపే బాధ్యత ప్రతి ఒక్క ప్రొఫెసర్లపై ఉందని గుర్తు చేశారు.

SEC Pardhu

చదువులో పోటీ తత్వం ఉంటే రాబోయే రోజులు ఆనందంగా గడుపుతారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా గ్లోబల్ ఎడ్యుకేషన్ చుట్టూ తిరుగుతుందని, ప్రైవేట్ సెక్టార్, ఇనిస్టిట్యూషన్స్ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్ బాగుంటే విద్యార్థులు అవలీలగా గ్లోబల్ ఎడ్యుకేషన్ దిశగా అడుగులు వేస్తారని పార్థసారధి తెలిపారు. కళాశాలను విడిచి వచ్చే 20 నుండి 30 సంవత్సరాల్లో పూర్తిగా న్యానో టెక్నాలజీ వైపు ప్రపంచమంతా మారిపోతుందని అన్నారు. 16 శతాబ్దం వరకు విద్యా రంగంతో పాటు వ్యవసాయ రంగంలో కూడా భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, అనంతరం పారిశ్రామిక విప్లవం, డిజిటల్ మానిటరింగ్ వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలు అన్ని సాంకేతిక పరిజ్ఞానంలో ముందు ఉండడానికి పోటీ పడుతున్నాయని గుర్తుచేశారు.

Univarsicity

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా యూనివర్సిటీని మరింత బలోపేతం చేసే విధంగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ యూనివర్సిటీ మరింత అభివృద్ధి చెందడానికి ఫ్యాకల్టీ సిబ్బంది కృషి ఎంతో అవసరమని వారికి దిశానిర్దేశం చేశారు. అంతకుముందు యూనివర్సిటీ సమస్యలపై ఏబీవీపీ విద్యార్థి సంఘాలు తెలంగాణ యూనివర్సిటీ సమస్యలు, అనధికారికంగా చేపట్టిన నియామకాలపై వెంటనే విచారణ చేపట్టి న్యాయం చేయాలని తెలంగాణ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవనం ముందు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్లు డి.రవీందర్ గుప్తా, రిజిస్టర్ కనకయ్య, న్యాయ విభాగం డిన్ వినయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రా, ఆర్డీఓ రవి, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.



Next Story