హాస్టళ్ల మూసివేత… రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు

by  |
హాస్టళ్ల మూసివేత… రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు
X

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విద్యా సంస్థలను మూసివేసిన విషయం తెలిసిందే. ఇక విద్యా సంస్థలు మూసివేయడంతో వాటికి సంబంధించిన హాస్టళ్లను ఖాళీ చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో యూనివర్శిటీ హాస్టళ్లు మూసివేయటంపై విద్యార్థులు రోడ్డెక్కారు.

సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ వద్ద ఉన్న పీజీ కాలేజీవద్ద రోడ్డుపై విద్యార్థులు బైఠాయించి నిరసన తెలియజేసారు. హఠాత్తుగా హాస్టళ్లు మూసివేస్తే ఇబ్బందులు పడతామని, హాస్టళ్లు మూసివేతను వెంటనే నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక విద్యార్థులు రోడ్డుపై ధర్నా నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్ కి భారీ అంతరాయం కలిగింది. మరో పక్క పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులు సైతం హాస్టళ్లు తెరవాలని డిమాండ్ చేస్తూ రోడెక్కారు. కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని, హాస్టల్స్ మాత్రం మూయటానికి వీలు లేదని వారు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed