Princeton కాలేజీ వేధింపులు.. లావణ్య ఆత్మహత్య

by  |
Princeton
X

దిశ, ఘట్‌కేసర్ : ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోడిమెట్ల ప్రిన్స్‌స్టన్ కళాశాల యాజమాన్యం వేధింపులు భరించలేక విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. ఫీజు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడికి చేయడంతో లావణ్య(18).. ఫీజు చెల్లించలేక, తల్లితండ్రులకు భారం కాలేక సెల్ఫీ వీడియో తీసుకొని, ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల ప్రకారం.. వనపర్తి గాంధీ నగర్‌కు చెందిన లావణ్య.. ఘాట్‌కేసర్‌లోని ప్రిన్స్‌స్టన్ ఇంజనీరింగ్ మహిళ కళాశాలలో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతోంది. తండ్రి వృత్తి రీత్యా వాచ్ మెన్, తల్లి దినసరి కూలిగా పని చేస్తున్నారు. అయితే, కళాశాల యాజమాన్యం ఫీజు కట్టాలని వేధింపులకు గురిచేయడంతో 25వేల ఫీజు చెల్లించలేక.. మసస్తాపంతో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

కళాశాల ముందు ఏబీవీపీ ధర్నా..

లావణ్య ఆత్మహత్యకు కారణమైన ప్రిన్స్‌స్టన్ కళాశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాల ముందు ధర్నాకి దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కళాశాలకు చేరుకొని సమస్యను పరిష్కరించారు.


Next Story