- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జాతీయస్థాయిలో మెరిసిన పినపాక విద్యార్థి
by Sridhar Babu |

X
దిశ,మణుగూరు : జాతీయస్థాయి ఖేల్ కబడ్డీ లీగ్ పోటీలకు పినపాక మండలానికి చెందిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థి బొమ్మకంటి హరవర్ధన్ ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ సురేష్ తెలిపారు. శుక్రవారం ఆ పాఠశాలలో ప్రిన్సిపాల్ మాట్లాడారు. నవంబర్ 27న గోవాలో జరిగిన రాష్ట్రస్థాయి ఖేల్ కబడ్డీ క్రీడలో ఉత్తమప్రతిభ కనబరిచిన హర్షవర్ధన్ జాతీయ స్థాయి క్రీడ కబడ్డీకి ఎంపిక అయ్యాడని పేర్కొన్నారు. అలాగే ఈనెల(డిసెంబర్)17 నుంచి 20 వరకు జరగబోయే ఖేల్ కబడ్డీ పోటీల్లో హర్షవర్ధన్ పాల్గొననున్నట్లు ఆయన చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంపికైనా విద్యార్థి హర్షవర్ధన్ ను ఎక్స్ లెంట్ పాఠశాల కరస్పాండెంట్ యూసఫ్ షరీఫ్, డైరెక్టర్స్ ఖాదర్, యాకూబ్ షరీఫ్, నర్సారెడ్డి, బండారు నరేంద్ర, ఉపాధ్యాయులు అభినందించారు.
Next Story