విద్యార్థినిని గొంతుకోసి చంపేసిన ఉన్మాది

by  |
విద్యార్థినిని గొంతుకోసి చంపేసిన ఉన్మాది
X

కరీంనగర్ జిల్లా విద్యానగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఉన్మాది చేతిలో విద్యార్థిని హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం రేపింది. ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న రాధిక అనే యువతిని అగంతకుడు గొంతుకోసి చంపేశాడు. ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ రోజు రాధిక కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.

Next Story

Most Viewed