‘స్ట్రీట్ లైట్’తో ఆ సీనియర్ హీరో రీఎంట్రీ…

139
street-light

దిశ, సినిమా : సీనియర్ హీరో వినోద్ కుమార్ రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘స్ట్రీట్ లైట్’. మూవీ మాక్స్ బ్యానర్‌పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి విశ్వ దర్శకులు కాగా మామిడాల శ్రీనివాస్ నిర్మించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరగ్గా.. ఈ నెల మూడో వారంలో మూవీ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వినోద్ కుమార్.. ‘మౌన పోరాటం’ చిత్రంలో తన క్యారెక్టర్‌లో ఉన్న షేడ్స్ అన్నీ ఈ మూవీలోనూ ప్లే చేసే అవకాశం దక్కిందన్నారు. క్రైమ్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిగిన సినిమా మెసేజ్ ఓరియంటెడ్‌గా వస్తోందని, స్ట్రీట్ లైట్ కింద జరిగే క్రైమ్స్ గురించి వివరించబోతుందని అన్నారు.

పగలు పెద్దమనుషుల్లా చెలామణి అయ్యేవారు రాత్రి అయితే ఎలా మారుతారు? ఓ అమ్మాయి జీవితంతో ఆడుకున్నవారిపై రివేంజ్ ఎలా తీసుకున్నారనే సస్పెన్స్‌ డ్రామాతో తెరకెక్కించారని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శక నిర్మాతలు హిందీలోనూ స్ట్రెయిట్ మూవీగా రిలీజ్ చేస్తున్నామని, ఇదే తమ మొదటి సక్సెస్ అని తెలిపారు. ‘స్ట్రీట్ లైట్’ బూతు సినిమా కాదని, ఫ్యామిలీతో కలిసి చూసే పిక్చర్ అని వివరించారు.