ఒడిశాలో వింత శిశువు జననం..!!

by  |
ఒడిశాలో వింత శిశువు జననం..!!
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ ప్రపంచంలో రోజుకో వింత బయట పడుతూనే ఉంది. ఒడిశాలోని ఓ గర్భిణీ స్త్రీ వింత ఆకారాలతో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు చర్మం చేప పొలుసులుగా ఉంటే.. తల లావుగా ఉంది. ఆ స్త్రీ కి ఆపరేషన్ చేసిన వైద్యులు శిశువును చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఎబిసిఏ 12 జ‌న్యువులో జ‌రిగే ఉత్ప‌రివ‌ర్త‌న‌లే హ‌ర్లేక్విన్ ఇక్థియోసిస్(Harlequin Ichthyosis) అనే రుగ్మ‌త‌కు దారితీసి ఇలాంటి శిశువులు పుడతారని, పది లక్షల మంది శిశువుల్లో ఒక్కరికి ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు.

శిశువులకు ఈ పరిస్థితి చాలా కఠినమైందని మందపాటి చర్మం కలిగి, లోతైన పగుళ్ల ద్వారా వేరు చేయబడిన వివిధ ఆకారపు పలకలుగా చర్మం విభజించబడి ఉంటుందని వైద్యులు వివరించారు. ఇటువంటి శిశువుల్లో ముఖ లక్షణాలు చెవులు, నోరు, కళ్లు కూడా వికృతంగా కనిపిస్తాయి. ఇలా జన్మించిన పిల్లలు ఒకటి, రెండు రోజులు మాత్రమే జీవిస్తారని వెల్లడించారు. ఇలాంటి సంఘటనే గతంలో మహారాష్ట్రలోని నాగపూర్ లో జరిగింది. ఆ శిశువు కొన్ని రోజులు మాత్రమే జీవించింది.


Next Story

Most Viewed