మార్చి 30 వరకు షూటింగ్స్ బంద్

by  |
మార్చి 30 వరకు షూటింగ్స్ బంద్
X

దిశ, హైదరాబాద్
ప్రపంచ వ్యాప్తంగా, బారత్ సహ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని రకాల సినిమా షూటింగ్ రద్దు చేసుకోవాలని ఐఎంపీపీఏ, డబ్యూఐపీఎఫ్ఏ,ఐఎఫ్‌టీపీసీ, ఐఎఫ్‌డీఏ ఉమ్మడిగా నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నేటి నుంచి మార్చి 31 వరకు సినిమా షూటింగ్స్, సీరియల్, వెబ్ సిరీస్, ఏ ఇతర ఎలక్ట్రానిక్ షూటింగ్స్‌లకు విరామమిస్తున్నట్టు ప్రకటించారు. సినిమాహాళ్లు, స్పోర్ట్స్ క్లబ్‌లు, ఏ ఇతర ఈవెంట్లకు అనుమతిచ్చేది లేదని తేల్చి చెప్పారు. భారతదేశంలో ఇప్పటికే అత్యవసర అరోగ్యపరిస్థతి విధించిన నేపథ్యంలో వారి మద్దతుగా ఈ బంద్ పాటిస్తున్నట్టు వారు ప్రకటించారు. కచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. షూటింగ్స్ పున:ప్రారంభం ప్రారంభించే విషయమై మార్చి 30 తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

tags;corona virus, stops film shooting, till march 31, reviews on march 30



Next Story