డంపింగ్‌ యార్డ్‌ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం : మున్సిపల్ కమిషనర్

by Kalyani |
డంపింగ్‌ యార్డ్‌ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం : మున్సిపల్ కమిషనర్
X

దిశ, కల్వకుర్తి : డంపింగ్‌ యార్డులో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మునిసిపల్‌ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ అన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ లో రెండ్రోజులుగా హరిహర టౌన్ షిప్ సమీపంలో గల డంపింగ్ యార్డులోని చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు లేక అధిక స్థాయిలో చెత్త పేరుకుపోవడం వల్ల లోపలి నుంచి వెలువడే వేడి గ్యాస్ లీకేజీ ద్వారా తగలబడే అవకాశం ఉందని ఆయన అన్నారు. చుట్టుపక్కల రెండు, మూడు కిలోమీటర్ల మేరకు ఈ పొగ వ్యాపించిందని, స్థానికుల సమాచారం మేరకు మున్సిపల్, ఫైర్ సిబ్బంది డంపింగ్ యార్డు లో 48 గం. శ్రమించి మంటలు ఆర్పి పొగ వెలుబడకుండా చేశారన్నారు.

పట్టణంలోని సిబిఎం కళాశాల వెనుకాల నూతన డంపింగ్ యార్డు నిర్మాణం పూర్తి అయ్యిందని, బయో మైనింగ్ సైతం ఏర్పాటు చేశామన్నారు. 15 రోజుల్లోపు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని, సేంద్రియ ఎరువులు తయారికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చెత్తను సెగ్రిగేషన్‌ చేసేందుకు ఆధునిక పరికరాలు వినియోగించి రోజూ కొన్ని టన్నుల చెత్తను రీ సైక్లింగ్‌ చేయిస్తామని ఆయన అన్నారు. పట్టణ, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు డంపింగ్‌ యార్డ్‌నుంచి ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సూచించారు. డంపింగ్‌ యార్డ్‌లో పచ్చదనం పెంపొందించేలా పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతోపాటు దుర్గంధాన్ని చాలావరకు తగ్గిస్తామని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ అన్నారు.



Next Story

Most Viewed